వాటా ఇస్తానని చెప్పి.. రూ. 84 లక్షలు స్వాహా
NTR: గ్యాస్ కంపెనీలో వాటా ఇస్తానని మోసం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భవానీపురానికి చెందిన సాయి కుమార్ అనే వ్యక్తికి గ్యాస్ ఏజెన్సీలో వాటా ఇస్తానంటూ పలుమార్లు అతని వద్ద నుంచి హరికృష్ణ పలు దఫాలుగా రూ. 84 లక్షలు తీసుకున్నాడు. ఎంతకీ వాటాలు ఇవ్వకపోవడంతో సాయికుమార్ ప్రశ్నించాడు. హరికృష్ణ ఇంటికి పిలిచి అనుచరులతో దాడి చేయించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.