విద్యార్థుల కోసం కలెక్టర్ ప్రత్యేక ప్రణాళిక

విద్యార్థుల కోసం కలెక్టర్ ప్రత్యేక ప్రణాళిక

GNTR: సచివాలయంలో ఇవాళ, రేపు కలెక్టర్‌ల సదస్సు జరగనుంది. ఈసారి జిల్లా నుంచి ప్రత్యేక ప్రజంటేషన్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా విద్యార్థుల కోసం కొత్త ప్రతిపాదనలు రూపొందించారన్నారు. 9వ తరగతి నుంచే 10వ తరగతి సిలబస్ బోధన ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఉదయం ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులకు భోజనం కూడా అందించాలన్నారు.