ఓరుగల్లు అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్: ఛైర్మన్
HNK: భద్రకాళి దేవాలయాన్ని ఆధ్యాత్మికంగా, మౌలిక సదుపాయాల పరంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి అన్నారు. భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని ఛైర్మన్ సందర్శించి మాట్లాడుతూ.. అమ్మవారి కృపతో కుడా పరిధిలోని అన్ని పనులు నిర్విఘ్నంగా కొనసాగాలని తెలిపారు. ఓరుగల్లు అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందన్నారు.