VIDEO: స్మార్ట్ సిటీలో చెత్త సమస్యపై సీపీఐ నిరసన
TPT: నగరంలో చెత్త సమస్య తీవ్రంగా ఉందని సీపీఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్ విమర్శించారు. కేశవాయనగుంట–బైరాగిపట్టెడ ప్రాంతాల్లో ఇళ్ల మధ్య చెత్త కుప్పలు పేరుకుపోయాయని తెలిపారు. 14వ డివిజన్‌లో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, మున్సిపల్–పంచాయతీ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిష్కరించకపోతే ప్రజా పోరాటాలు కొనసాగిస్తామన్నారు.