'యువత చెడు మార్గాలకు దూరంగా ఉండాలి'

ప్రకాశం: యువత చెడు మార్గాలలో పయనించవద్దని సందేశాత్మకమైన పాటను జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం ఆవిష్కరించారు. డోల శ్యామలాదేవి రచన, స్వర కల్పన చేసిన ఈ పాట యువతకు మార్గదర్శకం కావాలని ఆయన అన్నారు. పాటను అద్భుతంగా మలచిన సాంకేతిక నిపుణులను ఎస్పీ కొనియాడారు. యువత బాగా చదువుకొని చెడు మార్గాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.