VIDEO: విస్సన్నపేట మండల పరిషత్ అధ్యక్షుడిగా మల్లయ్య

VIDEO: విస్సన్నపేట మండల పరిషత్ అధ్యక్షుడిగా మల్లయ్య

NTR:  విస్సన్నపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా గద్దల మల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో ఎన్నిక ప్రక్రియ సాఫీగా పూర్తైంది. ఆయన చేత ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ మాధురి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మల్లయ్యకు అధికారులు, ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలుపుతూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు.