బాలికల విద్యాలయంను తనిఖీ చేసిన మంత్రి

NDL: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు మెరుగైన వసతి, భోజన సదుపాయాలు నాణ్యమైన విద్యను అందించాలని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం బనగానపల్లెలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ మేరకు రూ. 2.5 కోట్ల నిధులతో అదనంగా మరో 6 నూతన రూమ్‌లు నిర్మించి, జూనియర్ కాలేజీగా విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు.