గండీడ్‌లో పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లు పరిశీలన

గండీడ్‌లో పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లు పరిశీలన

MBNR: గండీడ్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏర్పాటు చేశారు. సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అక్కడి ఏర్పాట్లను తనిఖీ చేసి, ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో మంజులకి సూచించారు. ఓటర్లను మాత్రమే లోపలికి అనుమతించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.