లోన్ యాప్స్ జోలికి పోవద్దు

HNK: తక్షణమే నగదు వస్తుందని ఆన్‌లైన్ లోన్ యాప్స్ జోలికి వెళ్లొద్దని ఆత్మకూరు ఇన్‌స్పెక్టర్ సంతోశ్ ప్రజలకు సూచించారు. సీపీ ఆదేశాల మేరకు గురువారం రాత్రి ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవద్దని సూచించారు.