ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. ఆటో ఢీ ఒకరు మృతి

ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. ఆటో ఢీ ఒకరు మృతి

NLR: ఉలవపాడు మండలం రాజుపాలెం గ్రామ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావేల్ కావేరి బస్సు కూలీలతో వెళుతున్న ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మిగతా వారికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.