సీహెచ్‌సీని సందర్శించిన ఎమ్మెల్యే

PPM: కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జగదీశ్వరి మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు. అనంతరం సూపరింటెండెంట్ సందీప్ కుమార్ మాట్లాడి ఆసుపత్రిలో నిల్వ ఉన్న మందులు గురించి తెలుసుకొన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.