'బ్యాటరీల దొంగతన కేసులో ఇద్దరు అరెస్టు'

NLG: కనగల్ మండలంలో వాహనాల నుండి బ్యాటరీలు చోరీ చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు నల్గొండకు చెందిన వారుసముద్రాల కృష్ణ(28), షేక్ టిప్పు సుల్తాన్(26)గా గుర్తించారు. వారి వద్ద నుండి 20 బ్యాటరీలు (రూ. 1.45 లక్షల విలువ), రూ. 24,000 నగదు, ఒక మోటార్ సైకిల్, బజాజ్ ఆటో, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 6 చోరీలు చేసినట్లు ఒప్పుకున్నారు.