VIDEO: అగ్ని ప్రమాదం.. మొక్కజొన్న పంట దగ్ధం

VIDEO: అగ్ని ప్రమాదం.. మొక్కజొన్న పంట దగ్ధం

WGL: ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామ శివారులో గురువారం ప్రమాదవశాత్తు మొక్కజొన్న చేనుకు నిప్పు అంటుకుంది. ఈ ఘటనలో బొల్లం ప్రకాష్‌కు చెందిన సుమారు నాలుగు ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో రైతు తీవ్రంగా నష్టపోయారు. కళ్ల ముందే పంట కాలిపోవడంతో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.