గుణదల మేరీ మాత ఉత్సవాలకు పార్కింగ్ స్థలాలు ఇవే..!
NTR: గుణదల మేరీ మాత ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. రామవరప్పాడు వైపు నుంచి వచ్చే వాహనాలకు జియాన్ బైబిల్ స్కూల్ వద్ద, ఏలూరు రోడ్ బీఆర్టీఎస్ వైపు నుంచి వచ్చే వాహనాలకు బీఆర్టీఎస్ మధురానగర్ మధ్య రోడ్డులో పార్కింగ్ ఏర్పాటు చేశారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలు, FM అలర్ట్స్ గమనించాలన్నారు.