రౌడీ షీటర్లకు సీఐ వార్నింగ్

రౌడీ షీటర్లకు సీఐ వార్నింగ్

EG: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని రౌడీ షీటర్లకు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లకు ధవళేశ్వరం సీఐ టి.గణేశ్ హెచ్చరించారు. ఆదివారం ధవళేశ్వరం పోలీస్ స్టేషన్‌లో సీఐ వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని, ఎటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయినా ఉపేక్షించేది లేదని, పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు.