CMRF చెక్కులు అందజేసిన ఎంపీ
HNK:పేదలకు సీఎం సహాయనిధి ఒక వరంగా మారిందని ఎంపీ కడియం కావ్య అన్నారు. ఎంపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం 10 మంది లబ్ధిదారులకు రూ. 3.50 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఆమె స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం చేరుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.