పుట్టపర్తి ఎయిర్‌పోర్టులో భద్రతపై ఎస్పీ పరిశీలన

పుట్టపర్తి ఎయిర్‌పోర్టులో భద్రతపై ఎస్పీ పరిశీలన

SS: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి వేడుకల సందర్భంలో పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి విమానాశ్రయంలో చేపట్టనున్న భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ పరిశీలించారు. డీఎస్పీ విజయ్ కుమార్‌తో కలిసి విమానాశ్రయాన్ని సందర్శించిన ఆయన, వేడుకల సందర్భంగా భద్రత పటిష్టంగా ఉండాలని అధికారులకు సూచనలు చేశారు.