ఆటో బోల్తా.. డ్రైవర్ మృతి
MNCL: కాసిపేట మండలంలోని దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సల్పాల వాగు వద్ద ఆటో బోల్తా పడి దుర్గం గోపాల్ (55) అనే డ్రైవర్ మృతి చెందాడు. SI గంగారం వివరాల ప్రకారం.. గోపాల్ ఆటో దేవాపూర్ నుంచి సోమగూడెం వైపునకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు బోల్తా పడింది. గాయపడిన అతన్ని గ్రామస్తులు మంచిర్యాలకు తరలించగా, అక్కడి నుంచి కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.