'ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలి'

VKB: పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా మున్సిపల్ సిబ్బంది కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ సూచించారు. శుక్రవారం ఆయన మున్సిపల్ కౌన్సిల్ హాల్లో శానిటరీ సిబ్బందితో సమావేశమయ్యారు. ఇళ్ల మధ్య పెరిగే పిచ్చి మొక్కలను తొలగించి, మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడాలని ఆదేశించారు. అంతేకాకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లాలని కూడా తెలిపారు.