VIDEO: ఒంగోలులో సందడి చేసిన రాకాస చిత్ర బృందం
ప్రకాశం: రాకాస సినిమా ఘన విజయం సందర్భంగా సక్సెస్ టూర్లో భాగంగా చిత్ర బృందం ఒంగోలులోని కృష్ణ థియేటర్లో మంగళవారం సందడి చేసింది. థియేటర్ వద్ద అభిమానులు హీరో, హీరోయిన్లకు ఘన స్వాగతం పలికారు. చిత్ర యూనిట్ ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించి, వారి నుంచి వస్తున్న స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేశారు.