పంట సంజీవినితో రైతులకు మేలు: MLA

SKLM: ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పంట సంజీవిని పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని MLA రమణమూర్తి తెలిపారు. శనివారం పోలాకి మండలం దీర్ఘాశిలో పంట సంజీవిని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు తమ పంట పొలాలలో కేవలం ఒక రెండు సెంట్లలో వీటిని నిర్మించుకుంటే సాగునీటి ఎద్దడి నివారించవచ్చునని పేర్కొన్నారు.