శ్రీకాళహస్తిలో లాయర్ల విధుల బహిష్కరణ
TPT: శ్రీకాళహస్తిలో న్యాయవాది వినోద్, ఆయన తండ్రిపై జరిగిన దాడిపై పోలీసులు చర్యలు తీసుకోవడంలేదని ఆరోపిస్తూ లాయర్లు సోమవారం విధులు బహిష్కరించారు. దాడి చేసిన వారిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో వెంకటేశ్వర్లు, మల్లికార్జునయ్య, రాజేశ్వర్ రావు, ఉదయ్ పాల్గొన్నారు.