KGBVలో దరఖాస్తులకు ఆహ్వానం
SKLM: జి.సిగడాం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇవాళ పాఠశాల ప్రిన్సిపల్ ప్రమీలా తెలిపారు. ఈనెల 12 నుంచి ఏప్రిల్ 1 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. అర్హులైన బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.