లోకేష్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జేసీ
E.G: రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో డిసెంబర్ 19న మంత్రి లోకేష్ పర్యటన నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లను జేసీ వై. మేఘా స్వరూప్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పర్యటనకు సంబంధించిన పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రత, శుభ్రత, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాల్లో లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వీరితో పాటు కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్ర రావు ఉన్నారు.