VIDEO: వరద ఉద్ధృతి.. అధికారులు అప్రమత్తం

VIDEO: వరద ఉద్ధృతి.. అధికారులు అప్రమత్తం

కృష్ణా: తోట్లవల్లూరు మండలంలో ప్రకాశం బ్యారేజీలో వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచనలు ఇస్తున్నారు. వరద ప్రభావం ఎక్కువైన ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయాన్ని అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.