ఉరేసుకుని నర్సు ఆత్మహత్య
HYD: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. PS పరిధలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తున్న యువతి బలవన్మరణానికి పాల్పడింది. తాను ఉంటున్న గదినే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.