యనమలకుదురులో గన్నవరం ఎమ్మెల్యే పూజలు
కృష్ణా: యనమలకుదురులోని శ్రీ రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. గన్నవరం MLA యార్లగడ్డ వెంకట్రావు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రభల ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. భోళాశంకరుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, CM చంద్రబాబు నేతృత్వంలో ఆకాంక్షించారు.