ట్రేడ్ లైసెన్స్ కొరకు ప్రత్యేక బృందాలు

ట్రేడ్ లైసెన్స్ కొరకు ప్రత్యేక బృందాలు

NZB: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భీంగల్ పట్టణంలో ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ వసూళ్ల కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు. శనివారం ఆయన ఆస్తి పన్ను వసూలు చేస్తున్న బృందాలను తనిఖీ చేసి, పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని, ప్రతి దుకాణాదారుడు ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు.