తల్లి మృతి.. కన్నీళ్లతో పరీక్ష రాసిన విద్యార్థిని
NLG: తిప్పర్తి (మ) అనిశెట్టిదుప్పలపల్లి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని మౌనిక విషాదం మధ్య కూడా పరీక్ష రాసి ధైర్యం చూపించింది. ఆరోగ్యం బాగాలేక మతిస్థిమితం కోల్పోయిన ఆమె తల్లి సైదమ్మ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. తల్లి మృతితో తీవ్రంగా కలత చెందిన మౌనికను పాఠశాల HM ఓదార్చి పరీక్షలకు పంపించారు. తల్లి మృతదేహం ఇంట్లోనే ఉండగా మౌనిక NLGలొని SPR పాఠశాలలో తెలుగు పరీక్ష రాసింది.