కురుమూర్తి స్వామిని దర్శించుకున్న జపాన్ వాసులు

కురుమూర్తి స్వామిని దర్శించుకున్న జపాన్ వాసులు

MBNR: చిన్నచింతకుంట మండలం అమ్మాపుర్‌లో కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం జపాన్ దేశానికి చెందిన పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. అలాగే దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి ఆలయ విశిష్టతను వారికి తెలిపి కాసేపు ముచ్చటించారు.