సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రసాద్
WGL: ఖిలా వరంగల్ మండలం రంగశాయిపేటకు చెందిన కేడల ప్రసాద్ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా నియమింపబడ్డాడు. ఈ మేరకు ఆయనను నియమిస్తూ ఆ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు చంటి ముదిరాజ్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. తనకు ఈ అవకాశం కల్పించిన జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులకు ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.