మహిళా కానిస్టేబుల్ మృతి.. ఎస్పీ సాయం

చిత్తూరు: ఇటీవల గుడిపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మహిళా కానిస్టేబుల్ లక్ష్మి మృతి చెందారు. ఆమె భర్త హరీశ్ బాబుకు ఎస్పీ మణికంఠ ఐడీఆర్ఎఫ్ ఫండ్ నుంచి లక్ష రూపాయల చెక్కును సోమవారం అందజేశారు. పోలీసు శాఖ తరఫున బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.