VIDEO: రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం నుంచి కుమ్మరి గూడెం వెళ్లే రహదారిలో ఆదివారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు చంద్రు తండాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.