టీఎల్ఎం ద్వారా సులభతర బోధన

SGR: న్యాల్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మండల స్థాయి ఎఫ్ఎల్ఎన్, టీఎల్ఎం మేళా నిర్వహించారు. టీఎల్ఎం మేళాను ఎంపీడీవో శ్రీనివాస్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు టీఎల్ఎం ద్వారా బోధిస్తే సులభంగా అర్థం చేసుకుంటారని అన్నారు. ఈ మేళాలో మండల విద్యాధికారి మారుతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.