బోథ్ పోలీసుల ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్

ADB: బోథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపును బుధవారం వారు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సమ్మర్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 7 సంవత్సరాలు పైబడిన విద్యార్థులకు క్యాంపులో క్రికెట్, యోగ, కరాటే, వాలీబాల్ కబడ్డీ పైన శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.