పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
SRCL: విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. ఎల్లారెడ్డిపేటలోని పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా భరోసా కల్పించాలన్నారు.