వైద్యాధికారుల నూతన కార్యవర్గం ఎంపిక

వైద్యాధికారుల నూతన కార్యవర్గం ఎంపిక

ASR: జిల్లాలోని పీహెచ్‌సీల వైద్యాధికారుల అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని జిల్లా ప్రోగ్రాం మానిటరింగ్ అధికారి డాక్టర్ కిరణ్ కుమార్ మంగళవారం తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ పీ.రాంబాబు, ఉపాధ్యక్షులుగా మణిదీపరెడ్డి, నిఖిల్, కార్యదర్శిగా చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని డీఎంహెచ్‌వో డా.కృష్ణమూర్తి అభినందించారు.