ఆకివీడు లో హై టెన్షన్.. పోలీసులతో భారీ బందోబస్తు
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయితీలో రామాలయం నిర్మాణానికి అనుమతి తీర్మానంపై హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కౌన్సిల్‌లో వైసీపీకి 13, కూటమికి 7 మంది సభ్యులు ఉండటంతో తీర్మానంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆలయ నిర్మాణంపై రాజకీయ విభేదాల వల్ల ఆందోళనకరమైన వాతావరణం నెలకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.