VIDEO: వేపాడలో భారీ అగ్నిప్రమాదం
VZM: వేపాడ మండలం కొండగంగుపూడి గ్రామ శివారులోని ఎస్.కోట సీతారాంపురంలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో లగుడు అప్పలకొండ కళ్ళంలో నిల్వ ఉంచిన 20 బస్తాల ధాన్యం, పశువుల పాక, గడ్డి మేటు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎస్.కోట అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. 2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు.