దోమల బెడదపై పొన్నం కీలక సూచనలు
TG: హైదరాబాద్‌లో దోమల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫీల్డ్ సిబ్బందికి ఫాగింగ్, ఐఆర్ఎస్ షెడ్యూల్ నిర్వహించాలన్నారు. ప్రతి వారం డ్రై డే నిర్వహిస్తూ నీటి నిల్వలు తొలగించాలని ఆదేశించారు.