23న 'ఎటర్నల్ సింఫొనీ' సంగీత విభావరి
సత్యసాయి బాబా 100వ జయంతి సందర్భంగా 'ది ఎటర్నల్ సింఫొనీ ఆఫ్ సెల్ఫ్‌లెస్ లవ్' అనే అద్భుత సంగీత కార్యక్రమం 23న పుట్టపర్తిలోని హిల్ వ్యూ స్టేడియంలో జరగనుంది. ప్రేగ్ ఫిల్‌హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో పాటు పద్మభూషణ్ పండిట్ అజోయ్ చక్రవర్తి, కౌశికీ చక్రవర్తి వంటి ప్రముఖ కళాకారులు పాల్గొంటారు. బాబా సందేశాన్ని ప్రతిబింబించే పాటలను ప్రదర్శించనున్నారు.