బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు: SP
ASF: బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు ఆసిఫాబాద్ SP కాంతిలాల్ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా SP ఆఫీస్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను విని, వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. తక్షణ పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలన్నారు.