పాదగయ క్షేత్రాన్ని దర్శించుకున్న స్వామిజీలు

పాదగయ క్షేత్రాన్ని దర్శించుకున్న స్వామిజీలు

EG: పవిత్ర గోదావరి మాత పవిత్రత, విశిష్ఠతను దేశ ప్రజలకు తెలియజేసేందుకు నాసిక్ నుంచి బయల్దేరిన 300 మంది స్వామీజీలు శుక్రవారం పిఠాపురం పాదగయ క్షేత్రానికి చేరుకున్నారు. వారు దత్తాత్రేయ స్వామి, రాజరాజేశ్వరి సమేత కుక్కుటేశ్వర స్వామి, పురుహూతికా అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సనాతన ధర్మం, దేశంలోని హిందువుల ఐక్యత కోసం ఈ యాత్ర చేపట్టినట్లు స్వామీజీలు తెలిపారు.