హుజూర్ నగర్‌లో నిరుద్యోగుల అక్రమ అరెస్ట్

SRPT: 2 లక్షల ఉద్యోగాల భర్తీకై చలో గాంధీభవన్‌కి పిలుపునిచ్చిన నేపథ్యంలో హుజూర్నగర్ లైబ్రరీలో చదివే నిరుద్యోగ అభ్యర్థులను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం హమీ ఇచ్చిన విధంగా జాబ్ క్యాలెండర్‌ని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నరేష్ శివ, జాన్సన్ జడ సాయి తదితరులు పాల్గొన్నారు.