VIDEO: ISS నుంచి ఇండియా ఎలా ఉందంటే?

VIDEO: ISS నుంచి ఇండియా ఎలా ఉందంటే?

అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపిస్తుందో చూపే వీడియోను వ్యోమగామి శుభాంశు శుక్లా షేర్ చేశారు. ISS హిందూ మహాసముద్రం నుంచి ఉత్తరం వైపు కదులుతున్నట్లు వీడియోలో చూపించారు. 'ఇందులో ISS తూర్పు తీరం వెంబడి ప్రయాణించింది. ఊదా రంగులో కనిపించేవి మెరుపులు. అవి తగ్గి చీకటి ప్రాంతం కనిపించిన ప్రదేశం హిమాలయ పర్వతాలు. ఆ తర్వాత సూర్యోదయంతో వెలుతురు రావడం గమనించవచ్చు' అని రాసుకొచ్చారు.