నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన.. MLA గండ్ర

BHPL: భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామం నుంచి గుడాడ్పల్లి వరకు రూ.2 కోట్ల సీఆర్ఆర్ నిధులతో నూతన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా MLA గండ్ర మాట్లాడుతూ, ఈ రోడ్డు పూర్తయితే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.