కరెంట్ షాక్‌తో రైతు మృతి
ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని సింగరపల్లిలో ఆదివారం సాయంత్రం విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన రైతు రమణయ్య పొలంలో పని చేస్తుండగా కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు. వ్యవసాయ పనుల నిమిత్తం పొలంలో ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై, ఘటనా స్థలంలోనే కుప్పకూలినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.