మెట్లపై నుండి జారిపడి మహిళా మృతి

మెట్లపై నుండి జారిపడి మహిళా మృతి

ATP: గుంతకల్లు పట్టణంలోని పకీరప్ప కాలనీలో గురువారం ఇంట్లోని మెట్ల మీద నుంచి జారి కిందపడి లక్ష్మీదేవి అనే మహిళ తీవ్రంగా గాయపడింది. గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలిస్తుండగా మార్గం మధ్యలో లక్ష్మీదేవి మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.