ప్రైవేట్ పాఠశాలల ప్రకటనలకు మోసపోవద్దు: ఎచ్ఏం లలిత
JN: దేవరుప్పుల మండలం మాదాపురం గ్రామ ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయులు గురువారం గ్రామంలో బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. హెచ్ఎం నల్ల లలిత మాట్లాడుతూ.. ప్రవైట్ పాఠశాలల ఆకర్షణీయమైన ప్రకటనలకు మోసపోయి డబ్బులు వృథా చేసుకోవద్దు అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారని, ప్రభుత్వం అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.