శనీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

NGKL: బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్‌లో వెలసిన శ్రీ సార్థసప్త జేష్టమాత సమేత శనీశ్వరాలయంలో శనిత్రయోదశి సందర్భంగా ఈనెల 26న ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ గోపాలరావు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు విశ్వనాథశాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించే పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని గ్రహ బాధల నుండి విముక్తి పొందాలని ఆయన పేర్కొన్నారు.